ఆర్.రమాదేవి మార్క్ ప్రేమ కవితను ఈరోజు ..
కాఫీటైమ్లో చూద్దాం..!!
నువ్వు హఠాత్తుగా ఎదురైతే ఏమవుతుంది ?
గుండె లయ తప్పుతుందా!
స్పృహ తప్పి పోతానా?
ఏది కాదేమో
నిన్ను తట్టి లేపిన జ్ఞాపకంపై కన్నెర్ర చేస్తాను
ఇటువైపు రాక కోసం ఎంత సమయాన్ని పోగొట్టుకున్నావోనని తల్లడిల్లుతాను
నన్ను నేను నిందించుకుంటాను
నీ రాకను పసికట్టలేని
నా మనసుపై నమ్మకం కోల్పోతాను..
ఓయ్ ...
రారాదూ ఓ క్షణమైనా...
ప్రేమించే గుణం కొదవబడిందేమో
లెక్క సరిచేసి పోరాదు..”!!
*Really ... Confused again
*రమాదేవి ఆర్..!!
అతగాడు హఠాత్తుగా ఎదురైతే…ఏమవతుంది? సహజంగానే ఆమె గుండె ‘ లయ ‘ తప్పుతుంది…
స్పృహ తప్పిపోతుంది.! అతడిని తట్టి లేపిన జ్ఞాపకంపై ఆమె కన్నెర్ర చేస్తుంది.
తనను డిస్ట్రబ్ చేసిన ఆ జ్ఞాపకం తనకు శత్రువే. అటు వైపు రావడం కోసం అతడు ఎంత సమయా
న్ని పోగొట్టుకున్నాడోనని తల్లడిల్లిపోతోంది...తన్ను తాను నిందించుకుంటుంది..అతడి రాకను
పసికట్టలేని తన మనసుపై నమ్మకం కోల్పోతోంది.
ఓయ్ ..!
ప్రేమించే గుణం కొరవడిందేమో? ఓ క్షణమైనా…ఇటు రారాదూ! ఓ సారి లెక్క సరిచేసి పోరాదా.!
అంటూ ప్రాధేయపడుతోందామె..అతడి జ్ఞాపకాల్లో వేగలేక..అతడితో కలిసి నడవలేక
మొత్తంమీద ఇప్పుడామె కన్ ఫ్యూజన్ లో.. వుంది.!!
*ఎ.రజాహుస్సేన్..!!